బడ్జెట్‌పై శాఖల వారీగా భట్టి సమీక్ష
TG: అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తును ముమ్మరం చేస్తోంది. శాఖల వారీగా ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రీ-బడ్జెట్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, ప్రజా భద్రతకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.