రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
GNTR: ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు భారీగా వరద నీరు విడుదలవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లిపర మండలంలో కృష్ణా నది పరివాహక గ్రామాలకు వరదముప్పు పొంచి ఉండడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. సోమవారం బొమ్మువానిపాలెం వద్దకు 18 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని బోట్లను సిద్ధం చేశారు.