100% పింఛన్లను ఒకే రోజు పంపిణీ చేయాలి: కలెక్టర్

100% పింఛన్లను ఒకే రోజు పంపిణీ చేయాలి: కలెక్టర్

సత్యసాయి: కొత్తచెరువు మండలం బైరాపురం గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై, లబ్ధిదారులకు పింఛన్లు, ఉచిత బియ్యాన్ని అందజేశారు. పింఛన్లు సకాలంలో అందుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. 100% పింఛన్లను ఒకే రోజు పంపిణీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.