వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం: లోకేష్
AP: డల్లాస్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రవాసాంధ్రులు అండగా నిలిచారు. వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. వైసీపీ వై నాట్ 175 అంటే, ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. విదేశాల్లో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ NRT అండగా ఉంటుంది' అని పేర్కొన్నారు.