పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు
ఎన్టీఆర్ జిల్లాలో ఐదేళ్లుగా రైతుల ఆదాయానికి ఆధారమైన మామిడి సాగులో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని సీపీఎం పార్టీ నాయకులు సుధాకర్ అన్నారు. సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్న రైతులు క్రమంగా ఈ పంటను తగ్గించి పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. మామిడి సాగు పూర్తిగా దెబ్బతినకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.