అంతర్రాష్ట్ర సరిహద్దులో వాహన తనిఖీలు

అంతర్రాష్ట్ర సరిహద్దులో వాహన తనిఖీలు

SRD: మొగుడంపల్లి మండలం మాడ్గి వద్ద తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో పోలీసులు అర్ధరాత్రి మెగా నాకాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ నేతృతంలో హైదరాబాద్-ముంబయి 65వ జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు కొనసాగించారు. అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల వరకు రాష్ట్రంలోకి రాకపోకలు సాగించే వాహనాలను పరిశీలించారు. జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్ల సిబ్బందితో వాహన తనిఖీలు చేశారు.