VIDEO: చుక్కా రామయ్యకు ఎర్రబెల్లి శుభాకాంక్షలు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త, ‘ఐఐటీ రామయ్య’గా పేరుగాంచిన చుక్కా రామయ్య 100వ జన్మదిన సందర్భంగా గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. రామయ్య విద్యారంగంలోనే కాక తెలంగాణ ఉద్యమంలోనూ ప్రేరణగా నిలిచిన మహనీయుడని పేర్కొన్న ఎర్రబెల్లి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.