ములుగులో పది వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

MLG: ములుగు జిల్లాలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో పది శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. క్రీడా శిక్షణకు మొత్తం 14 దరఖాస్తులు రాగా అర్హత ప్రమాణాలను అనుసరించి 10 మంది శిక్షకులను ఎంపిక చేశామన్నారు. సంబంధిత క్రీడా శిక్షకులు ఎంపిక చేసిన ప్రదేశాలలో మే 1 నుంచి జూన్ 6 వరకు బాల బాలికలకు శిక్షణ ఇస్తారని వెల్లడించారు.