295 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
SRD: జహీరాబాద్ పోలీసులు, సివిల్ సప్లై అధికారులతో కలిసి మంగళవారం హుగ్గేల్లి శివారులో లారీని ఆపి తనిఖీ చేయగా 295 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు అబ్దుల్, ఇస్మాయిల్‌లను అదుపులోకి తీసుకుని రూ. 9.44 లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కాశీనాథ్ తెలిపారు.