నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
GNTR: ప్రత్తిపాడు (M) కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నిమ్మగడ్డవారిపాలెం, కొత్తమల్లాయపాలెం, పాతమల్లాయపాలెం, గింజుపల్లివారిపాలెం, తిమ్మాపురం, మేడావారిపాలెం, వంగిపురం గ్రామాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.