దేవాలయంలో సుందరకాండ పారాయణం

దేవాలయంలో సుందరకాండ పారాయణం

SRPT: నడిగూడెం మండలం సిరిపురం శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజతోపాటు సుందరకాండ పారాయణం నిర్వహించారు. చిన్న జీయర్ స్వామి శిష్యులు వెంకట వరదాచార్యులు సుందరకాండ పారాయణం చేశారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి చక్రధరాచార్యులు, కమిటీ  ఛైర్మన్ టి.రమేష్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.