పెళ్లికి తాళిబొట్టు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

పెళ్లికి తాళిబొట్టు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

KRNL: సలకలకొండ గ్రామానికి చెందిన నరసన్న కుమార్తె వివాహానికి తాళిబొట్టు, కాలి మెట్టెలను మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అందజేశారు. ఇవాళ గ్రామ నాయకుల సమక్షంలో కుటుంబానికి అందజేశారు. సామాజిక బాధ్యతగా అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.