VIDEO: గుత్తేదారుల దోపిడీ.. ఇబ్బందుల్లో రైతులు..!
అన్నమయ్య: పీలేరు వారపు సంతలో గుత్తేదారులు రైతుల వద్ద నుంచి బలవంతంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, పంచాయతీ నిర్ణయించిన ధర కంటే రెండింతలు వసూలు చేస్తున్నారని, దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఇవాళ తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని ఈ అక్రమ వసూళ్లను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.