కారును ఢీకొట్టిన ఆటో

కారును ఢీకొట్టిన ఆటో

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సినిమా థియేటర్ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న కారును వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అసంపూర్తిగా ఉన్న డివైడర్ల వల్లే తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.