ఈనెల 23న సీపీఐ రాష్ట్ర మహాసభలు

ELR: భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఈనెల 23న ఒంగోలు నగరంలో నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ తెలిపారు. ఏలూరులో గురువారం ఆయన మాట్లాడారు. ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం వేలాది మందితో ప్రజా ప్రదర్శన ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.