నేడు డయల్ యువర్ డీఎం

WGL: నర్సంపేట ఆర్టీసీ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజరు ప్రసూన లక్ష్మి తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు వారి సందేహాల నివృత్తికి, సలహాలు, సూచనలకు 73829 26166 నంబరుకు ఫోన్ చేయాలని ఆమె కోరారు. డిపో అభివృద్ధికి, సేవల మెరుగుదలకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్న ఆమె తెలిపారు.