'అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలి'
సూర్యాపేట పట్టణంలో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డికు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్లు అధ్వానంగా మారి ప్రజలు అనారోగ్యం, ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు.