మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు

మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం పెద్ద వరిమడుగు గ్రామంలో మామపై అల్లుడు పెట్రోలు పోసి నిప్పందించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై కోపం పెంచుకున్న పోతుల బాబు మామ జయరావుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలు కావడంతో జయరావుని కనిగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.