కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాలు పెంచాలని నిరసన

కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాలు పెంచాలని నిరసన

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ ఓసీపీలో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాలు పెంచాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సహాయ కార్యదర్శి కాసీపేట రాజేశం మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు లేక కన్వేయన్స్ డ్రైవర్లు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.