'లిక్కర్ స్కాం వాళ్లే చేశారని నేను అనలేదు'

AP: లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నిన్న సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. కానీ, స్కాంకు సంబంధించి పైవాళ్లే చేశారని తాను చెప్పలేదని అన్నారు. అసలు లిక్కర్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను అరెస్ట్ చేస్తారని కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.