మత్స్యకారులు జీవనోపాధిపై శిక్షణ
SKLM: టెక్కలి మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లోని స్వదేశీ, సాగర, చేపల పెంపకం మత్స్యకారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిపై శిక్షణ ఇచ్చారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న సుదీర్ఘ సముద్ర తీరంలో పీతల పెంపకం, సముద్ర నాచు, సముద్ర పంజరాల్లో చేపల పెంపకం ద్వారా నిరంతర జీవనోపాధి లభిస్తుందని తెలిపారు.