'పోస్టల్ బ్యాలెట్లు ముందుగా లెక్కింపు కలెక్టర్'

'పోస్టల్ బ్యాలెట్లు ముందుగా లెక్కింపు కలెక్టర్'

VZM: జూన్ 4వ తేదీన జ‌రిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ‌లో ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ల లెక్కింపు మొద‌ల‌వుతుంద‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి సోమవారం తెలిపారు. ఉద‌యం 8 గంట‌ల‌క‌ల్లా ఖచ్చితంగా ప్రారంభించాల‌ని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది అంతా ఉద‌యం 6 గంట‌ల‌కే లెక్కింపు కేంద్రాల‌వ‌ద్ద‌కు చేరుకొని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాల‌ని, ఉద‌యం 8.30కు ఈవిఎం ఓట్ల లెక్కింపు మొద‌లు పెట్టాల‌న్నారు.