VIDEO: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి
NLG: కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన స్టేజీ, పందిరి ఒక్కసారిగా కుప్పకూలడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. నామమాత్రపు ఏర్పాట్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉత్సవాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.