కేజీహెచ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ హరేంధిర

VSP: విశాఖ కేజీహెచ్‌ను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను, వైద్యులను ఆయన ఆదేశించారు. వివిధ విభాగాల హెచ్‌వోడీలతో సమావేశమైన కలెక్టర్, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు సేవలందించడంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు.