పెళ్లైన మూడు రోజులకే నవ వధువు మృతి

పెళ్లైన మూడు రోజులకే నవ వధువు మృతి

NRPT: పెళ్లైన మూడు రోజులకే కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో విషాదం నెలకొంది. కాళ్లకు రాసిన పారాణి ఆరకముందే గొల్ల శ్రీలత (21) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడి వేధింపులు తాళలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడునాళ్ల ముచ్చటగా మారిన ఈ సంబురంపై కుటుంబం కన్నీరుమున్నీరైంది. యువకుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆశ్రయించారు.