21 ద్విచక్ర వాహనాలు సీజ్
KDP: మైదుకూరు అర్బన్ పోలీసులు నంబర్ ప్లేట్లు లేని, సరైన నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. సరైన నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే నేరమని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అర్బన్ ఎస్సైర రమణారెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.