పట్టణంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు 142వ జయంతి

గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు 142వ జయంతి జరిగింది. ఈ కార్య క్రమానికి కార్యదర్శి సుబ్బరత్నమ్మ అధ్యక్షత వహించారు. హరిసర్వోత్తమరావు స్వాతంత్య్ర సమరయోధుడిగా, తొలి రాజకీయ ఖైదీగా, పత్రికా రచయితగా తెలుగు జాతికి చేసిన సేవలను కొనియాడారు.