జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

KNL: జిల్లాలోని 11 మండలాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం కురిసింది. కోసిగి మండలంలో అత్యధికంగా 16.4 మిల్లీమీటర్లగా నమోదైంది. గోనెగండ్ల 9.1, సీ.బెళగల్ 7.0, ఎమ్మిగనూరు 6.5, కర్నూలు రూరల్ 6.4, నందవరం 6.2, పెద్దకడబూరు 4.4, కర్నూలు అర్బన్, గూడూరు 4.0, ఆలూరు 3.2, కౌతాళం 2.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సంబంధిత అధికారులు మంగళవారం వెల్లడించారు.