చేతి పంపు నీరు తాగిన ములుగు జిల్లా కలెక్టర్

ములుగు: తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామాన్ని శుక్రవారం ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. రాబోయే వేసవి కాలంలో గ్రామంలో తాగునీరు, గ్రామస్తులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న చేతి పంపు నీటిని తాగి చూశారు. రుచికరంగా ఉన్న ఈ నీళ్లను ఎందుకు తాగడం లేదు అని గ్రామస్తులను ప్రశ్నించారు.