వేతనాలు లేక డీడీఎన్ అర్చకుల ఇబ్బందులు

వేతనాలు లేక డీడీఎన్ అర్చకుల ఇబ్బందులు

NRML: గత మూడు నెలలుగా వేతనాలు లేక ధూప దీప నైవేద్య అర్చకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత పది రోజుల క్రితం జిల్లాలోని కొంతమంది అర్చకులకు వేతనాలు పడినప్పటికీ మిగతా వారికి వేతనాలు బ్యాంక్ అకౌంట్‌లో జమ కాకపోవడంతో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అధికారులను ఆరా తీస్తే పొంతనలేని సమాధానం చెప్పడంతో ఇక మాకు వేతనాలు ఇక రావేమో అంటూ మనస్థాపానికి గురవుతున్నారు.