ఒకే ఇంటి పేరుతో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు
RR: మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్ పంచాయతీలో ఎస్సీ మహిళా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లు, ఇంటిపేర్లు ఒకటే కావడం గమనార్హం. వీరిలో ఒకరు బీఆర్ఎస్ మద్దతుతో కత్తెర గుర్తుపై, మరొకరు కాంగ్రెస్ మద్దతుతో ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు. కాగా ఈ నెల 17న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే.