26న తిరుపతిలో రాష్ట్ర మహాసభలు
CTR: ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పుంగనూరులో సీపీఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, హమాలీ వర్కర్స్‌తో కలసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈనెల 26న తిరుపతిలో సభలు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్మికులు ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు.