'నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకోం'

ASR: సీలేరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులు అయిన గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకోమని దండకారణ్య విమోచన సమితి హెచ్చరించింది. సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపులో డీఎల్‌వో ఆద్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. సీలేరులో నిర్మించబోయే నూతన ప్రాజెక్టులో గిరిజనులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.