టిఫిన్ తింటూ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే
JGL: కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సాధారణ ప్రజల మాదిరిగానే స్థానిక నాయకులతో కలిసి శనివారం ఓ టిఫిన్ సెంటర్ వద్ద అటుకులు తింటూ స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేతో వారి సమస్యలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.