బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జలుమూరు జనార్దన్ రావు ఇల్లు అగ్నికి ఆహుతి అయింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు.