సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

SRD: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలని సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గిఫ్ట్ కార్డులు, డిస్కౌంట్‌ల కోసం, వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో QR కోడ్ ఆన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చని చెప్పారు. అదేవిధంగా మీ వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావచ్చన్నారు.