కోవూరులో టీడీపీలోకి భారీగా చేరికలు

నెల్లూరు: కోవూరు పట్టణంలోని కాపువీధిలో వైసీపీ నాయకులు కాటంరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.