గిరిజన కుటుంబాలకు అండగా ఉంటాం: ఆర్డీవో

గిరిజన కుటుంబాలకు అండగా ఉంటాం: ఆర్డీవో

NLR: అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు గ్రామంలో గిరిజన కుటుంబాలను ఆత్మకూరు ఆర్డీవో బి.పావని మంగళవారం సందర్శించారు. ఈ మేరకు రోడ్డు, విద్యుత్, గృహవసతులపై వివరాలు తెలుసుకుని, గిరిజన కుటుంబాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, తమ ఇళ్ల వద్దకే వచ్చి సమస్యలు విన్నందుకు గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.