చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

ELR: మండే ఎండలు, వడగాడ్పుల నేపధ్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం ఒక మంచి పరిణామం అని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ప్రయాణికులు, పాదచారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు.