'నది పరివాహాక ప్రజలు జాగ్రత్తలు పాటించాలి'

WNP: నది పరివాహక ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు మండల తాహసీల్దార్ షేక్ చాంద్ పాషా మంగళవారం తెలిపారు. మండలంలోని మూలమల్ల, జూరాల, గుంటిపల్లి, మోట్లంపల్లి, ఆరేపల్లి, కెతేపల్లి, రేచింతల గ్రామాలలోని ప్రజలు నదీ ప్రవాహ ప్రదేశంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. పశువులు మేపడానికి నది సమీపంలో వెళ్లకూడదని, సాగునీరు నిమిత్తం నదిలో మోటర్లు వేయకూడదని సూచించారు.