ఎమ్మెల్యే సొంత ఖర్చుతో చెరువుకు మరమ్మత్తులు

MHBD: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో ఉప్పని వారి కుంట చెరువుకు గండ్లు పడడంతో నీరు వృధాగా పోతున్న విషయాన్ని గ్రామరైతులు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ స్వయంగా ఉప్పనివారి కుంట చెరువును సందర్శించి సొంత ఖర్చుతో చెరువు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.