VIDEO: స్టేడియంలో కుక్కల స్వైర విహారం

GNTR: వీధి కుక్కల బెడద బి.ఆర్ స్టేడియంలోనూ వదలడం లేదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల కోసం చిన్నపిల్లల్ని పంపిస్తుంటే ఈ కుక్కలతో ఎప్పుడేం జరుగుతుందోనని భయం పట్టుకుందని చెబుతున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్న ఈ ఆవరణలో ఇటువంటి పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.