ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఇవాళ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.