కంభం చెరువును పరిశీలించిన DSP

ప్రకాశం: జిల్లా కంభం మండలంలోని కంభం చెరువును శనివారం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాలు కంభంలో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో విగ్రహాల నిమజ్జనం కంభం చెరువులో జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ డీఎస్పీ నాగరాజు, సీఐ మల్లికార్జునతో కలిసి చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.