జిల్లా యువకుడికి సివిల్స్‌లో 259వ ర్యాంక్
NZB: భీమగల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన వర్షిత్ రెడ్డి UPSC సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 259వ ర్యాంక్ సాధించారు. పట్టుదలతో కష్టపడి ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న వర్షిత్ రెడ్డిని గ్రామస్థులు శుక్రవారం అభినందించారు. జిల్లాకే గర్వకారణంగా నిలిచారన్నారు. తన ప్రతిభతో గ్రామానికి పేరు తెచ్చిన వర్షిత్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.