పులివెందుల ఎన్నికలపై ఎమ్మెల్యే సెటైర్లు

పులివెందుల ఎన్నికలపై ఎమ్మెల్యే సెటైర్లు

NLR: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన బిడ్డకు కేవలం 10% ఓట్లు రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల ప్రజలకు 30 ఏళ్లుగా ఓటు విలువ తెలియదని, తొలిసారి ఎన్నికలు పెడితే ఇలా కుమ్మేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.