వీరవల్లిలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం

వీరవల్లిలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం

కృష్ణా: బాపులపాడు(M) వీరవల్లిలోని కృష్ణా మిల్క్ యూనియన్‌లో జాతీయ పాల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. సహకార వ్యవస్థలో రాజకీయం లేకుండా, రైతుల ప్రగతిని ఎజెండాగా పెట్టుకుని పాల సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆవరణలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.