గౌరవం ఇవ్వడం లేదని ర్యాగింగ్
KNR: గంగాధర మండలం మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు గౌరవం ఇవ్వడం లేదని దారుణంగా కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి పాఠశాల గోడ దూకి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తినట్లు సమాచారం.