ముర్రుపాలల్లో వ్యాధి నిరోధక శక్తి అధికం

BHNG: అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వార్షికోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం మరియా రాణి మాట్లాడుతూ... ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలను అందించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.