బీజేపీ నాయకుడికి పద్మచక్ర అవార్డు

బీజేపీ నాయకుడికి పద్మచక్ర అవార్డు

మేడ్చల్: బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాయకులు మక్కల నర్సింగరావుకు తెలంగాణ ప్రభుత్వం పద్మచక్ర అవార్డు అందజేసింది. రవీంద్రభారతిలో జరిగిన జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతికశాఖ సౌజన్యంతో ప్రముఖ రాజకీయవేత్త, సినీనటులు బాబుమోహన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు అందజేసినందుకు నర్సింగరావు కృతజ్ఞతలు తెలిపారు.